News

ఏపీ లో ఉచిత కుట్టు మెషిన్ల పథకం 2025

ఏపీ లో ఉచిత కుట్టు మెషిన్ల పథకం 2025

అమరావతి:

పేదింటి మహిళల స్వయం ఉపాధి కై ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ కొరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉచిత కుట్టు మెషిన్ల పంపిణి పథకం ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరం లో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలో 60 నియోజక వర్గాలలోని, నియోజకవర్గానికి 3 వేల చొప్పున మొత్తంగా 1 లక్ష వరకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు .

AP Free Sewing Machine Scheme 2025

అర్హతలు ఏమిటి ?

  • మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు
  •  ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి .
  •  సరియైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
  •  సంబంధిత కుల ధ్రువీకరణ పత్రము కలిగి ఉండాలి.
  •  వయసు 20 నుండి 40సం. మధ్య ఉండాలి .
  • ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షలకు మించరాదు .
  • వితంతువులు, దివ్యంగ మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు.
  •  ట్రైనింగ్ తీసుకునే సమయం లో హాజరు కనీసం 70% ఉంటె కుట్టు మెషిన్ ఇస్తారు .
  •  ప్రస్తుతం BC /EWS కులాలకు చెందిన వారు అర్హులు.
  •  హౌస్ మ్యాపింగ్ ను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.

ఎలా అప్లై చేయటం?

సొంతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ ఉండదు. కేవలం మీరు ఉన్నటువంటి గ్రామా లేదా వార్డు సచివాలయంలో మాత్రమే దరఖాస్తుకు ఆప్షన్ ఇస్తారు . కింద తెలిపిన డాకుమెంట్స్ జిరాక్స్ లు తీసుకొని దరఖాస్తు చేయాలి .

 

1. ఆధార్ కార్డు

2. ఆదాయ ధ్రువీకరణ పత్రము [ Income Certificate ]

3. కుల ధ్రువీకరణ పత్రము [ Caste | Integrated Certificate]

4. రేషన్ / రైస్ కార్డు

5. పనిచేస్తున్న మొబైల్ నెంబర్

6. పాస్ పోర్ట్ సైజు ఫోటో

7. దరఖాస్తు ఫారం.

 

2 thoughts on “ఏపీ లో ఉచిత కుట్టు మెషిన్ల పథకం 2025

Comments are closed.