ఉచిత గ్యాస్ స్కీం: నెలాఖరు లోగా బుక్ చేసుకోండి
ఉచిత గ్యాస్ స్కీం: నెలాఖరు లోగా బుక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ‘దీపం-2′ పథకంను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు వార్షికంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు.
ముఖ్యమైన సమాచారం
- ఇప్పటి వరకు ఉచిత సిలిండర్ బుక్ చేయని లబ్ధిదారులు ఈ నెలాఖరు లోగా మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవాలి.
- ఏప్రిల్ 2025 నుండి రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం.
- ఒకవేళ ఈ నెలాఖరు లోగా మొదటి సిలిండర్ బుక్ చేయకపోతే, మొత్తం మూడు ఉచిత సిలిండర్లలో ఒక దాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
- ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకున్నారు.
- 94 లక్షల మందికి 48 గంటల లోపే బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ జమైంది.
- ఇంకా 14,000 మందికి సబ్సిడీ చెల్లింపులు ప్రాసెస్‌లో ఉన్నాయి.
ఎలా అప్లై చేసుకోవాలి?
- మీ గ్యాస్ ఏజెన్సీ లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకోండి.
- ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతా ఉండాలి.
- దీపం-2 పథకం కింద రిజిస్టర్ అయిన లబ్ధిదారులే అర్హులు.
ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునేవారికి ALERT! ‘దీపం-2’ పథకం లబ్ధిదారులకు ముఖ్య సమాచారం:
ఇంకా ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేయనివారు ఈ నెలాఖరు లోగా తప్పనిసరిగా బుక్ చేసుకోండి! లేకపోతే మొత్తం మూడు ఉచిత సిలిండర్లలో ఒకదాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి రెండవ సిలిండర్ బుకింగ్ ప్రారంభం. ఇప్పటి వరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ పొందారు.

Pingback: E-KYC is mandatory to receive ration. If pending, ration will not be provided from April - abcnewshub.in
Pingback: AP Mega DSC 2025: Teacher Recruitment, Vacancies & Selection Process - abcnewshub.in
Pingback: Andhra Pradesh Deepam-2 Scheme – Reasons for Subsidy Delay & Solutions - abcnewshub.in